శివసేన తిరుగుబాటు నేతలకు ఆ పార్టీ అల్టిమేటం జారీ చేసింది. ముంబైలో నిర్వహించే సమావేశానికి సాయంత్రం 5లోగా హాజరు కావాలని ఆదేశించివంది. లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొంది.
ఈ మేరకు వారికి లేఖను వాట్సాప్, ఈ మెయిల్, ఎస్ఎంఎస్ ల ద్వారా పంపారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో నేడు సాయంత్రం శివసేన ఎమ్మెల్యేలతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి ఎమ్మెల్యేలంతా సాయంత్రం 5లోగా హాజరు కావాలని సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆదేశించారు. ఎవరైనా ఎమ్మెల్యే హాజరు కాని పక్షంలో వారు పార్టీని వీడటానికి సిద్ధంగా ఉన్నట్టు భావిస్తామని చెప్పారు.
పార్టీ నుంచి వారి సభ్యత్వాన్ని తొలగించనున్నట్టు హెచ్చరించారు. ఉద్దవ్ ఠాక్రేకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ క్రమంలో సమావేశానికి ఆయన వర్చువల్ గా హాజరవుతారని పార్టీ శ్రేణులు తెలిపాయి.