శివ కందుకూరి హీరోగా రాశి సింగ్ హీరోయిన్ గా పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “భూతద్ధం భాస్కర్ నారాయణ”. మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మించారు.
ఈ చిత్రం ఫస్ట్ లుక్ నుంచి రీసెంట్ గా విడుదల చేసిన మోషన్ పోస్టర్ వరకూ ప్రతిది ఎట్రాక్ట్ చేసింది. ఈ చిత్రాన్ని మార్చి 31న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. దీనికి కూడా చిన్న మోషన్ పోస్టర్ తో డేట్ ఎనౌన్స్ చేశారు.
మార్చి 31న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తారు. ధియేటర్ కి వచ్చిన ప్రతి ప్రేక్షకులకి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ అందించబోతున్నాడు భూతద్దం భాస్కర్‌నారాయణ. ఈ చిత్రంలో ఏ సన్నివేశాన్నీ ముందుగా ఊహించలేం. అంత కష్టంగా ఉండేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దర్శకుడు.
ఇక ఈ చిత్రానికి సంభందించి మరిన్ని అప్‌డేట్స్ సంక్రాంతి సీజన్ తరువాత ప్రేక్షకులకి అందిస్తామని నిర్మాతలు తెలిపారు.ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.