కశ్మీర్ లో సరిగ్గా నెల రోజుల పాటు షూట్ చేశారు విజయ్ దేవరకొండ, సమంత. అందమైన మంచు కొండల్లో, వణికించే చలిలో సినిమా షెడ్యూల్ పూర్తిచేశారు. అయితే ఈ క్రమంలో ఓ సీన్ షూట్ చేస్తున్నప్పుడు విజయ్ దేవరకొండ, సమంత ఇద్దరూ గాయపడ్డారట. నిన్నట్నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మేటర్ ఇది. దీనిపై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.
నెల రోజుల షూటింగ్ లో ఒక్క సారి కూడా విజయ్, సమంత గాయపడలేదని, అంతా సాఫీగా సాగిపోయిందని శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చాడు. “సెట్స్ లో గాయపడిన విజయ్-సమంత” అంటూ వస్తున్న వార్తల్ని ఆయన కొట్టిపారేశారు. నిన్ననే యూనిట్ అంతా హైదరాబాద్ వచ్చింది.
కొన్ని రోజులు రిలాక్స్ అయిన తర్వాత సెకెండ్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో మొదలుపెడతారు. ఈ గ్యాప్ లో యశోద మూవీకి సంబంధించిన పనుల్ని సమంత, లైగర్ పనుల్ని విజయ్ దేవరకొండ పూర్తి చేయబోతున్నారు.
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు ఖుషి అనే టైటిల్ పెట్టారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్ దేవరకొండ, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కామెడీ సీన్లు అందర్నీ ఎంతగానో నవ్విస్తాయని చెబుతున్నాడు నిర్వాణ.