జార్ఖండ్ లో బీజేపీ ఓటమిపై శివసేన విమర్శలు గుప్పించింది. పౌరసత్వ చట్టం పని చేయలేయలేదని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, అమిత్ షాలు గుర్తించాలని శివసేన నేత సంజయ్ రౌతు అన్నారు. జార్ఖండ్ ను బీజేపీ ఐదేళ్లు పాలించింది. ఈ ఎన్నికల్లో మోదీ, అమిత్ షా లు వారి శక్తినంతా ప్రయోగించారు.మోదీజీ పేరు మీద ఓట్లు అడిగారు…కానీ కొత్తగా తెచ్చిన సిటిజన్ షిప్ యాక్ట్ వారికి లాభం చేకూర్చలేదు…మహారాష్ట్ర తర్వాత మరో రాష్ట్రాన్ని బీజేపీ కోల్పోయిందని సంజయ్ రౌతు అన్నారు.జార్ఖండ్, మహారాష్ట్రలో ఓటమికి కారణాలను బీజేపీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.