తిరుపతి సభకు అనుమతి ఇవ్వకపోతే హైకోర్టుకు వెళ్తామని అమరావతి ఐక్య పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి అన్నారు. ఈనెల 17న నిర్వహించబోయే సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని శివారెడ్డి అన్నారు. సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ లేఖ ఇస్తే.. ఆంక్షలకు సంబంధించి వివరణ ఇవ్వాలని ప్రత్యుత్తరం పంపినట్లు ఆయన పేర్కొన్నారు. పాదయాత్రలో 42 కేసులు నమోదైనందున.. ఎందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు ప్రశ్నించినట్లు శివారెడ్డి తెలిపారు.
కాగా పాదయాత్రలో నమోదైన కేసులు రాజకీయ ప్రేరేపితమైనవేనని.. తాము ఎలాంటి నిబంధనలు ఉల్లఘించలేదని వివరించారు శివారెడ్డి. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే కోర్టు ద్వారానే అనుమతి తెచ్చుకుంటామని శివారెడ్డి స్పష్టం చేశారు.