మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో శివసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ మంత్రి, శివసేన సీనియర్ నాయకుడు ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలో 17 మంది ఎమ్మెల్యేలు తిరుబాటు బావుటా ఎగురవేసినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఆయన్ని చీఫ్ విప్ పదవి నుంచి శివసేన మంగళవారం తొలగించింది. ఆయన స్థానంలో మరో ఎమ్మెల్యే అజయ్ చౌదరిని చీఫ్ విప్ గా నియమించింది.
దీనిపై ఏక్ నాథ్ షిండే ట్విట్టర్ లో స్పందించారు. అధికారం కోసం తాను ఎప్పుడూ ఎవరిని మోసం చేయలేదన్నారు. బాలా సాహెబ్ తమకు హిందుత్వం గురించి నేర్పించారుని చెప్పారు.
బాలాసాహెబ్ ఆలోచనల విషయంలో తాము గతంలో మోసం చేయలేదని, భవిష్యత్ లోనూ మోసం చేయబోమన్నారు. ఈ క్రమంలో శివసేన ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు.