మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేశ్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం‘భోళా శంకర్’. ఈ చిత్రం కోసం మిల్కీ బ్యూటీ తమన్నాతో జతకట్టనున్నారు మెగాస్టార్. అంతే కాదు ప్రముఖ కథానాయిక కీర్తి సురేష్ చిరంజీవికి సోదరిగా నటిస్తుంది.
అయితే హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఓ న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీ నుంచి తమన్నా తప్పుకున్నట్లు వార్తలు ఇండస్ట్రీలో జోరందుకున్నాయి.
తమన్న పాత్ర కంటే కీర్తి సురేష్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉన్నప్పటికీ మూవీ ఒప్పుకున్న మిల్క్ బ్యూటీకి మేకర్స్ మరో షాక్ ఇచ్చారట. అయితే తనకు తెలియకుండా తమన్న చేసే కొన్ని సీన్స్ స్క్రిఫ్ట్ నుంచి తొలగించారట.
దీంతో తమన్న పాత్ర ప్రాధాన్యతో పాటు రన్ టైం కూడా తగ్గిపోవడంతో అసహనం వ్యక్తం చేసిన బ్యూటీ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది.
కాగా.. మేకర్స్ సైతం ‘భోళా శంకర్’ సినిమాలో తమన్నాకు బదులు వేరే హీరోయిన్ తీసుకునే పనిలో పడ్డారట. మరి ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.