మొబైల్స్, ఇంటర్నెట్, టాక్ టైం ఇలా ప్రతి విషయంలో ముందుగా ప్రజలకు తక్కువ ధరలు లేదా ఉచితాల పేరుతో అలవాటు చేసి తరువాత రేట్లు పెంచడం బిజినెస్ లో ఓ టెక్నిక్. ఇప్పుడు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ కూడా అదే బాటలో నడుస్తోంది. ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ రేట్లు భారీగా పెంచింది.
నెలవారీ సబ్ స్క్రిప్షన్ గతంలో రూ. 129 ఉండగా.. ఇప్పుడు రూ.179కి చేరింది. ఇక మూడు నెలల సబ్ స్క్రిప్షన్ రేటు రూ.329 నుంచి రూ.459కి పెరిగింది. సంవత్సరానికి అయితే.. రూ.999 నుంచి ఏకంగా 50శాతం పెరిగి రూ.1,499కి చేరింది. ఈ రేట్లు డిసెంబర్ 14 నుంచి అమలులోకి వస్తాయి.
అయితే, కొత్తగా రేట్లు పెంచినా.. ఎంపిక చేసిన కొంత మంది యూజర్లకు డిస్కౌంట్ తో ప్యాకేజీ అందించనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక భారం పెరుగుతున్నందునే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని అమెజాన్ ప్రకటించింది.