ఖమ్మంలో పర్యటిస్తున్న మంత్రులు కేటీఆర్, పువ్వాడకు బీజేపీ కార్యకర్తలు షాక్ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన LRS రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. NO LRS… NO TRS … GO TRS అంటూ మంత్రి కేటీఆర్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో…పోలీసులు బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేశారు.
త్వరలో ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఖానాపురం మినీ ట్యాంక్‌బండ్‌ను, రఘునాథపాలెం మినీ ట్యాంక్‌బండ్‌ను, బల్లేపల్లిలో వైకుంఠధామాన్ని ప్రారంభించారు. ఖమ్మం – ఇల్లెందు రోడ్డు అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ప్రారంభించారు. రఘునాథపాలెం – చింతగుర్తి బీటీ రోడ్డు వెడల్పు పనులను ప్రారంభించారు.
ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న టీఆర్ఎస్ కు… రాబోయే గ్రేటర్ వరంగల్, గ్రేటర్ ఖమ్మం కార్పోరేషన్ల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.