గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎక్కడ చూసిన చెరువులు, నదులు, ప్రాజెక్టులలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక సముద్రాలు భారీ అలలతో ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. ప్రభుత్వం, అధికారులు అందరూ కూడా ఎవరూ నీటి ప్రవాహాల వద్దకు, సముద్రాల వద్దకు వెళ్లవద్దని హెచ్చరికాలు జారీ చేస్తున్నప్పటికీ కొందరు వాటిని పెడచెవిన పెట్టి… ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి దుబాయ్‌లోని ఒమన్ లో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల ప్రకారం.. మహారాష్ట్ర కు చెందిన శశికాంత్ మమానే (42) అనే వ్యక్తి దుబాయ్‌లోని ఒక కంపెనీ లో సేల్స్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు.అయితే…శశికాంత్ తన భార్య పిల్లలు..శృతి(9),శ్రేయస్(6) లతో కలిసి ఒమన్ వెళ్లాడు. అక్కడ బీచ్‌లో సరదాగా గడపాలనుకున్నారు.వారంతా కూడా బీచ్ లో సరదాగా ఆడుకుంటున్నారు.
సముద్రం నుంచి బలమైన అలలు ఎగిసి పడుతున్నాయి. పిల్లలు..ఉత్సాహం కొద్ది సముద్రం దగ్గరకు వెళ్లారు. అంతే ఒక్కసారిగా సముద్రపు అలలు ఉవ్వెత్తున్న ఎగిసి పడ్డాయి. దాంతో ఆ అలల్లో పిల్లలిద్దరూ చిక్కుకుని నీటి లోపలికి కొట్టుకుని పోయారు.
పిల్లలను కాపాడుకునేందుకు శశికాంత్ కూడా లోపలికి వెళ్లడంతో అతను కూడా నీటిలో కొట్టుకుని పోయాడు. దీంతో ఒడ్డున ఉన్న వారంతా భయపడి, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. గజ ఈత గాళ్లు వచ్చి రెస్క్యూ చేపట్టారు.
అక్కడే ఉన్న మరో వ్యక్తి నీటి అలలను తన ఫోన్ లో రికార్డు చేసుకుంటున్నాడు. దానిలో ఈ ఘటన రికార్డు అయ్యింది. ఈ క్రమంలో.. శశికాంత్, శ్రేయస్ శవాలు ఒడ్డుకు కొట్టుకుని వచ్చాయి. బాలిక శవం కోసం అధికారులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనతో బీచ్ లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Your "Life" is more important than your "Likes". pic.twitter.com/3XNjyirbwJ
— Dipanshu Kabra (@ipskabra) July 13, 2022
Advertisements