RRR సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వార్త వింటే రాజమౌళి పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కచ్చితంగా పగపడతారు. ఆ వార్త మరేదో కాదు RRR సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్ గుండుతో కనిపించనున్నాడట. ఇప్పటివరకు ఎన్టీఆర్ ని ఎంతో స్టైల్ గా చూసిన అభిమానులు గుండుతో చూసి ఎలా ఫీల్ అవుతారో మరి.
ఇప్పటికే RRR చిత్రం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్, కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలికి కథ అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కూడా కథ అందిస్తున్నారు.
ఈ చిత్రంలో ఏడు నుంచి ఎనిమిది పాటలు వరకు ఉండనున్నాయట. అందులో మూడు పాటలు సుద్దాల అశోక్ తేజ ఒక్కరే రాసినట్టు తెలుస్తోంది. 2020 జులై 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది.