ఐఫోన్ అనగానే యూత్ లో ఉండే పిచ్చి అంతా ఇంతా కాదు. ఐఫోన్ కోసం కిడ్నీ లు అమ్ముకున్న బ్యాచ్ కూడా ఉంది. ఇప్పుడు ఐఫోన్ కి క్రేజ్ అలానే ఉన్నా సరే… చాలా మందికి కొనుగోలు సామర్ధ్యం పెరగడంతో పెద్దగా వార్తల్లో రావడం లేదు. గతంలో మాత్రం అప్పు చేసి పప్పు కూడు అన్నట్టు అప్పు చేసి అయినా యాపిల్ ఫోన్ కొనే వరకు ఆగేవారు కాదు. ప్రస్తుతం ఐఫోన్ తన యూజర్లకు నూతన అనుభవాలు ఇవ్వడానికి కాస్త గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది.
ప్రస్తుతం ఐఫోన్ 13 సీరీస్ రన్ అవుతుండగా వచ్చే ఏడాది తర్వాతి మోడల్ వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంటున్నారు. రెండేళ్లకు ఐఫోన్ 15 వచ్చే అవకాశం ఉందని, అందులో ఎవరూ ఊహించని ఫీచర్ ను యాపిల్ కంపెనీ తీసుకొచ్చే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. యాపిల్ ఐఫోన్ 15 ప్రో మరియు ప్రో మ్యాక్స్ మోడల్‌లను ఫిజికల్ సిమ్ స్లాట్‌లు లేకుండా లాంచ్ చేయవచ్చు అనే టాక్ వినపడుతుంది. ఈ సిమ్ కోసం ఇప్పుడు ప్రయోగాలు మొదలుపెట్టిందని… దీని కోసం త్వరలో కీలక అడుగు పడుతుందని అంటున్నారు.
Advertisements
ఈ రెండు మోడల్స్ 2023లో విడుదల కానున్నాయి. బ్రెజిలియన్ వెబ్‌సైట్ కథనం ప్రకారం… ఎవరూ ఊహించని మరో ఫీచర్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఐఫోన్ 15 మోడల్ లో మరో ఫీచర్ ఏంటీ అంటే పెరిస్కోప్ లెన్స్ ను తీసుకొచ్చే అవకాశం ఉందని… ఇది కెమెరాల ఆప్టికల్ జూమ్‌ను గణనీయంగా మెరుగుపరుస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక వచ్చే ఏడాది విడుదల చేసే ఐఫోన్ లో 2 టీబీ వరకు స్టోరేజ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని టెక్ నిపుణులు అంటున్నారు.