లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మాస్టర్. అయితే ఈ చిత్రం రిలీజ్ కాకముందే ఆన్ లైన్ లో ప్రత్యక్షమై అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ విషయమై దర్శకనిర్మాతలు తలలు కొట్టుకున్నారు.అయితే ఈ పని ఎవరు చేశారు.. ఎందుకు చేశారు అంత అవసరం ఏమి వచ్చింది అనేది అందరికి ప్రశ్న గా మారింది.
అయితే సినిమాను ఆన్ లైన్ లో పెట్టింది ఎవరనేది తెలుసుకున్న చిత్ర యూనిట్ సభ్యులు షాక్ కు గురయ్యారు. అది ఎవరో కాదు ఆ సన్నివేశాలను ఓ థియేటర్ ఉద్యోగి లీక్ చేశాడట. చెన్నైలో ప్రతిష్ఠాత్మకమైన SDC థియేటర్ కు మాస్టర్ సినిమా ప్రింట్ వచ్చింది. ప్రింట్ నుంచి ఆ సినిమా సన్నివేశాలు లీక్ అయ్యాయని తెలుస్తోంది. అయితే సదరు ఉద్యోగి పై చిత్రయూనిట్ కంప్లైంట్ ఇచ్చింది. కంపెనీ పై కూడా లీగల్ చర్యలు తీసుకోవడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది.