తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రికార్డ్ స్థాయిలో అడ్మిషన్స్ వచ్చాయి. 2021-22 అకడమిక్ ఇయర్ కు సంబంధించి ఇప్పటిదాకా 405 కాలేజీల్లో 1,00,685 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. గతేడాది కన్నా 25 వేల అడ్మిషన్లు అదనంగా వచ్చాయి. కరోనా కారణంగా ప్రైవేట్ కాలేజీల్లో చేర్పించేందుకు తల్లిదండ్రుల విముఖత చూపినట్లుగా అధికారులు చెబుతున్నారు.
లక్ష మందిలో 18,144 మంది ఒకేషనల్ స్టూడెంట్స్ కాగా… 82,541 మంది జనరల్ విద్యార్థులు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని కాలేజీల్లోనే స్టూడెంట్స్ భారీగా చేరారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా ఫలక్ నుమా జూనియర్ కాలేజీలో 2,550 విద్యార్థులు జాయిన్ అయ్యారు.
గతేడాది ఫస్టియర్ లో అన్ని కాలేజీల్లో కలిపి 85,993 మంది చేరారు. అయితే ఈసారి మాత్రం భారీగా అడ్మిషన్లు వచ్చాయి. ఎక్కువగా సీఈసీ గ్రూప్ కి జాయిన్ అయ్యారు విద్యార్థులు.