లాస్ ఏంజెల్స్ వేదికగా జరుగుతున్న ఆస్కార్ అవార్డు వేదికపై కామెడీ చేయాలని చూసిన యాంకర్ చెంప చెల్లుమనిపించాడు ఓ హీరో. ముందుగా అందరూ షోలో భాగంగానే సరదాగా జరిగిన ఘటన అని భావించినప్పటికీ.. తర్వాత అసలు విషయం తెలుసుకొని షాక్ అయ్యారు. దీంతో అప్పటిదాకా నవ్వుతూ ఉన్న సినీ ప్రముఖులు, అభిమానులు ఈ అనుకోని పరిణామాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇంతకి ఏం జరిగిందంటే..?
94వ అకాడమీ అవార్డ్స్ ప్రెజెంటర్స్‌లో ఒకరైన క్రిస్ రాక్ ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు ప్రకటించడానికి ముందు వీక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం హీరో విల్ స్మిత్ సతీమణి జాడా పింకెట్ ప్రస్తావనను తీసుకొచ్చారు. ఆమెపై కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశారు. దీంతో అప్పటి వరకు నవ్వుతూ ఉన్న విల్ స్మిత్ కోపానికి గురయ్యాడు. వేదికపైకి వెళ్లి అందరూ చూస్తుండగానే క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించారు విల్ స్మిత్.
అనంతరం స్టేజీ దిగి వచ్చి కుర్చీలో కూర్చుని క్రిస్‌పై గట్టిగా అరిచారు. తన భార్య పేరు తన నోటి నుంచి రావొద్దంటూ గట్టిగా హెచ్చరించారు. ఇంతజరిగినా క్రిస్ మాత్రం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోలేదు. స్మిత్ హెచ్చరికకు ‘ఓకే’ అని సమాధానం ఇచ్చి.. టెలివిజన్ చరిత్రలోనే ఇది ఓ గొప్ప రాత్రి అని వ్యాఖ్యానించారు. అమెరికన్ నటి అయిన జడా పెంకెట్ ని విల్ స్మిత్ 1997లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
దీంతో ఈ వేడుకను లైవ్‌లో ప్రసారం చేస్తున్న డిస్నీహాట్ స్టార్ కొంత సమయం పాటు స్ట్రీమింగ్ ఆపివేసింది. సినిమా వేడుకల్లో సెన్సేషన్ కోసం, ఆడియన్స్‌కి కొంచెం థ్రిల్ పంచడానికి ఇలాంటి అసాధారణ పరిణామాలు స్క్రిప్ట్ ప్రకారం అమలు చేస్తారు. కాబట్టి విల్ స్మిత్ తోటి నటుడిని ఆస్కార్ వేదికపై కొట్టడం స్క్రిప్టెడా లేక నిజంగానే కొట్టాడా ? అనే అయోమయంలో ప్రముఖులు ఉండిపోయారు.
Will Smith punches Chris Rock at the #Oscars.
“Keep my wife’s name out of your fucking mouth”
— Pop Base (@PopBase) March 28, 2022
Advertisements