ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం 4గంటలకు ప్రధాని నరేంద్ర మోడీని కలవబోతున్నారు.రాష్ట్ర సమస్యలే ఈ సమావేశంలో ప్రధాన ఎజెండా అని చెబుతున్నప్పటికీ దీని వెనుక రాజధాని రహస్యం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం ఏపిని కుదిపేస్తోంది.బీజేపీ కూడా మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే , ఇది రాష్ట్ర పరిధిలోని అంశమని పక్కకు తప్పుకుంటుంది.అసలు కేంద్రం అనుమతి లేకుండా అడుగు ముందుకు వేయలేని పరిస్థితి లో జగన్ ఉన్నారు. వైసీపీ నాయకులు కూడా కేంద్రానికి చెప్పిన తరువాతనే నిర్ణయం తీసుకున్నామని పదే పదే చెబుతున్నారు.గతంలో అమిత్ షా జగన్ కు అప్పాయింట్ మెంట్ ఇబ్బంది పెట్టినప్పటికీ ఇప్పుడంతా వ్యవహారం సర్డుకుందని పొలిటికల్ విశ్లేషకుల అంచనా.బీజేపీ వైసీపీ ఇద్దరికీ ఎవరు అవసరాలు వారికి ఉన్నాయి కాబట్టి బంధం కొనసాగుతుందని ప్రధాన చర్చ.
ఇక జగన్ ఎదుర్కొంటున్న కేసుల వ్యవహారం , తోక జాడిస్తే మరింత బిగుసుకుని అరెస్ట్ వరకు వెళ్ళే అవకాశం ఉందని, మోదీ కాళ్ళ మీద పడడానికి జగన్ ఇవాళ మీట్ అవుతున్నారని టీడీపీ విమర్శిస్తోంది.