కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ మొత్తం మూగబోయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడిప్పుడే కరోనా కట్టడి అవుతున్న నేపథ్యంలో షూటింగ్ లు పునః ప్రారంభం అవుతున్నాయి. కాగా బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వారసుడు అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం బాబ్ బిస్వాస్ అనే సినిమా చేస్తున్నాడు. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ చిత్ర షూటింగ్ తాజాగా కోల్ కత్తా లో పునఃప్రారంభం అయింది. అయితే ఆ సినిమాలో అభిషేక్ కు సంబంధించి లుక్ ఒకటి బయటకు వచ్చింది. ఆ గెటప్లో అభిషేక్ గుర్తుపట్టలేని విధంగా కనిపించాడు. చెదిరిన జుట్టు, పెద్ద కళ్లజోడు, కాస్త బరువు పెరిగినట్టు కనిపించాడు.
మరోవైపు అభిషేక్ సరసన చిత్రాంగద నటిస్తోంది. షారుక్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా ద్వారా దర్శకుడు సుజోయ్ ఘోష్ కుమార్తె డియా అన్నపూర్ణ ఘోష్ దర్శకురాలిగా ఎంట్రీ ఇస్తున్నారు.