తరచుగా సినిమాల్లో కొన్ని భయంకరమైన స్టంట్స్ చూస్తూ ఉంటాము. అలాగే మనము చేయాలని, హీరోలా కన్పించాలని, నలుగురి చేత శభాష్ అనిపించుకోవాలని అనుకుంటాము. కానీ వాటిని చూసిన దగ్గర వదిలేస్తే మంచిది. వాళ్ళు నిపుణుల సమక్షంలో ఎంతో జాగ్రత్తగా స్టంట్స్ చేస్తారు. అవి కేవలం వినోదానికి మాత్రమే. అంతే కాని వాళ్ళలా మనమూ హీరోలా ఫీల్ అయ్యి, అలాంటి భయంకరమైన ఫీట్లు చేయాలనుకుంటే ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కొంతమంది మాత్రం మూర్ఖంగా ప్రవర్తిస్తూ చేయరాని పనులు చేస్తూ ఉంటారు.
తాజాగా కదులుతున్న రైలులో ప్రయాణం చేస్తూ భయంకరమైన విన్యాసాలు చేసిన ఓ బాలుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో ఆ బాలుడు కదులుతున్న రైలులో డోర్ పక్కన నిలబడి బయటకి తొంగి చూడడమీ కాకుండా, ట్రైన్ స్పీడ్ గా వెళ్తుండగా పక్కనే ఉన్న స్తంభాలను ముట్టుకోవడం, పట్టుకోవడం లాంటి వెకిలి చేష్టలు చేస్తున్నాడు. కొన్నిసార్లు పైకి, కిందకు దూకుతూ పిచ్చి పట్టిన కోతిలా ప్రవర్తిస్తున్నాడు. ఈ వీడియో చూస్తున్నంత సేపు వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.
అలాంటి భయంకరమైన విన్యాసాలు చేస్తున్న బాలుడికి అతని ఫ్రెండ్స్ కూడా తోడయ్యారు. అతని వెనుక ఉన్న వారు కూడా అలాగే చేస్తుండడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో పై పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎప్పుడూ ఇలా ప్రాణాల మీదకు తెచ్చే ఇలాంటి విన్యాసాల జోలికి వెళ్ళకూడదు. ఒక్కసారి పట్టు తప్పిందా అంతే సంగతులు. తిరిగి చూసుకోవడానికి ఏమీ మిగలదు.
Wow #OMG #Madness #trains #Travel @ladbible @HldMyBeer @CrazyFunnyVidzz @Viralmemeguy #Lol #funny @LockerRoomLOL @YoufeckingIdiot @LovePower_page @DailyViralPro @DailyViralPro pic.twitter.com/Tl8nEY9xfn
— Cazz inculo (@InculoCazz) September 14, 2021
Advertisements