ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ముందుండి కొట్లాడాల్సిన కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపు మేరకు ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్‌కు కాంగ్రెస్ సహ అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. అనుకున్నట్లుగా పోలీసులు ఎంత నిర్బందాలను అములు చేస్తున్నా…. కార్మికులు, విద్యార్థి ఉద్యోగ నేతలు భారీగా ట్యాంక్‌బండ్‌పైకి చేరుకుంటున్నారు. దాంతో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగిస్తూ, లాఠీ చార్జీలకు పాల్పడుతున్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ కూడా తన వంతు పాత్ర పోషిస్తోంది. బీజేపీ కార్యకర్తలు, నేతలు పోలీసుల కళ్లుగప్పి ట్యాంక్‌బండ్‌కు చేరుకొని కార్మికుల పక్షాన నినదిస్తున్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్సీ రాంచంద్రరావులు ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. నేను వచ్చి చూపిస్తా అని ముందు రోజు సవాల్ చేసి మరీ ఎంపీ బండి సంజయ్ ట్యాంక్‌బండ్‌కు చేరుకోవటం గమనార్హం.
అయితే, ముందుండాల్సిన కాంగ్రెస్ మాత్రం ఎక్కడా కనిపించటం లేదు. మమ్మల్ని అరెస్ట్ చేయారా అని అడిగిన చందంగా… ఇంట్లో ఉండటం, పోలీసులు యాధావిధిగా హౌజ్ అరెస్ట్ అని ప్రకటించారు కానీ చిత్తశుద్ధితో పోరాటం చేయటంలో కాంగ్రెస్ విఫలమయిందని కార్మికులు వాపోతున్నారు. తాము ఆర్ధాకలితో ఉంటే కొట్లాడాల్సిన నేతలు ఇలా చేస్తారా, మాకు సహయం చేయాల్సింది పోయి వాళ్లే చేతులెత్తేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి నాయకుడు ఉండి ఉంటే… ఖచ్చితంగా వచ్చేవారు అని వ్యాఖ్యానిస్తున్నారు కార్మికులు.
పీసీసీ అద్యక్షుడు, సీఎల్పీ నేతలు, మాజీ మంత్రులు… ఎమ్మెల్యేలు మాజీలు ఒక్కరు కూడా ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లోనూ కనిపించకపోవటం చర్చనీయాంశం అవుతోంది.
గత మిలియన్ మార్చ్‌లో ప్రభుత్వంలో ఉండి పాల్గొనక, ఇప్పుడు ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కై పాల్గొనలేనట్లున్నారు అంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.