కేవలం హైదరాబాద్ కు మాత్రమే పరిమితం అనుకున్న ఎంఐఎం క్రమంగా దేశవ్యాప్తంగా సత్తా చాటుతుంది. ఎన్నికలు జరుగుతున్న ప్రతి రాష్ట్రంలో ఎన్నో కొన్ని సీట్లు సాధిస్తుంది. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లోనూ 5 సీట్లు గెలుచుకుంది. అయితే, ఎంఐఎం బీజేపీని గెలిపిస్తుందని, ప్రతిపక్ష ఓట్లను చీల్చుతుందన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
బీహార్ ఎన్నికల ఊపుతో త్వరలో జరగబోయే బెంగాల్ ఎన్నికల్లోను పోటీ చేసేందుకు ఎంఐఎం రెడీ అవుతుంది. ఈ దశలో ఆ పార్టీ కీలక నేత షాయిక్ అన్వర్ హుస్సేన్ పాషా ఎంఐఎంను వీడి తృణముల్ కాంగ్రెస్ గూటికి చేరారు. ఎంఐఎం పోటీ చివరకు బీజేపీకి లాభం చేకూర్చుతుందని, ఓవైసీలు బెంగాల్ అడుగుపెట్టకుండా ఉంటే మంచిదంటూ పాషా వ్యాఖ్యానించాడు. బెంగాల్ లో 70శాతం ఓటర్లు మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన వారేనని… ఇలాంటి సందర్భంలో బీజేపీని ఓడించాలంటే ఎంఐఎం పోటీ చేయకపోవటమే మంచిదన్నారు.