టీమిండియా ఆటగాడు, రన్ మెషిన్ విరాట్ కోహ్లీపై పాకిస్తాన్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ వదులుకున్న విరాట్ కోహ్లీ ఇక మళ్లీ సెంచరీలతో విరుచుకుపడతాడని అన్నాడు. ఓ బీస్టు లాగా పరుగుల సునామీని సృష్టిస్తాడని తెలిపాడు.
కోహ్లీ మళ్లీ ఫామ్ లోకి రావడంతో పెద్ద ఆశ్చర్యమేమీ లేదన్నాడు. కోహ్లీ ఖచ్చితంగా వంద సెంచరీల మార్క్ ను దాటేస్తాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం కోహ్లీపై కెప్టెన్సీ భారం తగ్గిందన్నారు. ఇప్పుడు మానసికంగా చాలా ఫ్రీగా ఉన్నాడని అక్తర్ చెప్పాడు.
రాబోయే మ్యాచ్ ల్లో అతను మరింత ఫోకస్‌తో ఇన్నింగ్స్ ఆడుతాడన్నాడు. కోహ్లీ మొత్తం 110 సెంచరీలు కొట్టగలడన్న నమ్మకం తనకు ఉందన్నాడు. విరాట్ కోహ్లీ ఇటీవల మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో సెంచరీ బాదాడు.
తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 186 పరుగులు చేశాడు. సుమారు 1205 రోజుల తర్వాత టెస్టుల్లో కోహ్లీ సెంచరీ కొట్టాడు. తన 28వ టెస్టు సెంచరీ కోసం కోహ్లీ 41 ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది. తాజాగా సాధించిచ సెంచరీతో ఇంటర్నేషనల్ మ్యాచుల్లో కోహ్లీ సెంచరీల సంఖ్య 75కు చేరుకుంది.