నలుగురి ప్రాణాలను మింగిన చిరుతకు కనిపిస్తే కాల్చివేసే మరణశిక్షను వేశారు అటవీ శాఖ అధికారులు. ఎందుకంటే గతేడాది డిసెంబర్లో ఈ చిరుత వేర్వేరు సందర్భాలలో నాలుగు కంటే ఎక్కువ ప్రాణాలనే బలితీసుకుందని అటవీ శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అందుకే ఈ శిక్షను వేశారు. అయితే ఇంత మంది ప్రాణాలను మింగిన చిరుత కనిపిస్తే కాల్చివేయడానికి కూడా కొన్ని షరతులతో కూడిన అనుమతులను మాత్రమే ఇచ్చారు.
ఇక డీటైల్స్ లోకి వెళితే.. ఆంధ్రా, కర్ణాటక బార్డర్ లో పులులు,చిరుతలు కొన్ని నెలలు నుంచి పుట్టిస్తున్న టెర్రర్ అంతా ఇంతా కాదు. పిల్లలను వేసుకొని గుంపులు గుంపులుగా నడి రోడ్డుపైనే ప్రత్యక్షమై..జనాల వెన్నులో వణుకుపుట్టించాయి పులులు. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే మనుషులపై, పెంపుడు పశువులపై ఎటాక్ చేసి గడప దాటాలంటేనే జంకేట్టుగా చేశాయి. ఈ క్రమంలోనే జార్ఖండ్ లోని గర్వా, దాని పరిసర ప్రాంతాల్లో ఒక పులి సంచారం జనాల ప్రాణాలపైకి వచ్చింది.
ఆ పులి కారణంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ప్రాణాలు పోయాయి. డిసెంబర్ 2022 లో ఈ చిరుతపులి వేర్వేరు సందర్భాలలో జార్ఖండ్ లో కనీసం నలుగురిని పొట్టన పెట్టుకున్నట్టు అటవీ శాఖ నిర్ధారణకు వచ్చారు. దీంతో దానిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. చిరుతపులిని చంపడానికి జార్ఖండ్ అటవీ శాఖ షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వెల్లడించారు.
గతంలో మనేంద్రగఢ్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని జనక్ పూర్ ఫారెస్ట్ రేంజ్ లోని కున్వారి బీట్ కంపార్ట్మెంట్ 1341 సమీపంలోని అడవికి ఆనుకొని ఉన్న పొలంలో చిరుతపులి ఒక వ్యక్తిని చంపిందని అటవీ అధికారి తెలిపారు. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మృతి చెందిన వ్యక్తిని రామ్ దావన్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
చిరుతను పట్టుకునేందుకు వివిధ విభాగాల నుంచి అధికారుల బృందం చేరుకుంది. జనక్ పూర్ అటవీ రేంజ్ లో చిరుతపులి దాడి కారణంగా ఇప్పటి వరకు రెండు మరణాలు సహా మూడు సంఘటనలు ఉన్నాయని సర్గుజా వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ అన్నారు. చిరుతను ఎలాగైనా పట్టుకోవడానికి తమకు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వటర్ ఆఫ్ ఫారెస్ట్ అనుమతి లభించిందని వెల్లడించారు. దీంతో వీలైనంత త్వరగా చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.