అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. న్యూజెర్సీ రాష్ట్రంలోని జెర్సీ నగరంలోని నిత్యావసర సరుకుల దుకాణంలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఓ ట్రక్కులో ఘటనా స్థలికి చేరుకున్న దుండగులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. దీంతో దుకాణాల్లో ఉన్న వారు అక్కడే చిక్కుకుపోయారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఎదురు కాల్పులు జరిపారు. కొన్ని గంటల పాటు ఎదురు కాల్పుల అనంతరం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ముగ్గురు సాధారణ పౌరులు, ఇద్దరు అనుమానితులు, ఓ పోలీస్ ఉన్నతాధికారి ఉన్నారు. మృతుల కుటుంబాలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతాపం తెలిపారు. ఘటన భయంకరమైనదని అన్నారు.