సినీ నటి సౌందర్య ఎటువంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే నటి. తెలుగు కన్నడ మలయాళం ఇలా చాలా భాషలలో వందకి పైగా సినిమాలలో నటించింది సౌందర్య. ఎంతమంది హీరోలు వచ్చినా పోయినా సౌందర్య మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమైన హీరోయిన్. పొట్టి బట్టలు తో వచ్చిన హీరోయిన్స్ కు సైతం చీరకట్టుతో సమాధానం ఇచ్చింది. సౌందర్య హీరోయిన్ గానే కాదు దర్శకత్వం చేయాలని అనుకునేది. కానీ ఆ కోరిక తీరక ముందే 31 ఏళ్ల వయస్సులో చనిపోయింది.
ఇక సౌందర్య నటించిన ఆఖరి చిత్రం నర్తనశాల. ఈ సినిమా మొదటి షెడ్యూల్ లో సౌందర్య పాల్గొన్నారు. రెండవ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే లోపు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మాములుగా సౌందర్య నటించిన చాలా చిత్రాలు మనందరికీ తెలుసు. కానీ వీటితో పాటు ఆమె గెలుపు అనే సినిమాలో కూడా నటించారు. ఆ సినిమా కాపీ 20 ఏళ్ల కిందటే రెడీ అయింది. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఇప్పటికీ రామోజీ ఫిలిం సిటీ ల్యాబ్ లో ఓ బాక్స్ లో ఆ కాపీ ఉందట. ఈ సినిమా వివరాలు కూడా, గూగుల్ యూట్యూబ్ లో ఎక్కడా దొరకవు.
హీరోయిన్ విషయం లో రాజమౌళి మహేష్ ల మధ్య విబేధాలు…క్లారిటీ!!
ఇక ఈ సినిమా గురించే ఇప్పుడు తెలుసుకుందాం. రైతు భారతం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి సౌందర్య పరిచయమైంది. తొలి చిత్రానికి పాతికవేలు తీసుకున్న సౌందర్య క్రమేణా 50 లక్షలు రెమ్యునరేషన్ తీసుకునే వరకూ ఎదిగింది. అయితే 2002లో త్రిపురనేని వరప్రసాద్ మార్చి 20న రామోజీ ఫిలిం సిటీ లో గెలుపు అనే సినిమాను స్టార్ట్ చేశారు. ఇందులో సుహాసిని లయ తల్లీకూతుళ్లు గా నటించగా నరేష్ తండ్రి పాత్రలో నటించారు.
టాలీవుడ్ లో ఈ స్టార్స్ వల్లే వారంతా కనుమరుగైపోయారా!!
అలాగే ఒక డిఫెన్స్ లాయర్ గా సౌందర్య అతిథి పాత్ర పోషించారు. సౌందర్య గెస్ట్ రోల్ చేసిన మొదటి చిత్రం కూడా ఇదే. తాళి విలువ పట్టని భర్తకు భార్య విలువ తెలియాలి అనే కాన్సెప్ట్ తో దర్శకుడు వర ప్రసాద్ ఈ సినిమాను తెరకెక్కించారట.
బిడ్డలను కని వదిలేయడం కాదు బాధ్యతగా చూసుకోవాలని అంటూ కూతురు గెలుపును చూపించడమే ఈ సినిమా కథ. అయితే అంతా ఓకే అయ్యింది. 2003 జనవరిలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఓ కారణం వల్ల ఆగిపోయింది. అది ఏంటంటే సినిమా షూటింగ్ సమయంలో ఎంతో మంది బయ్యర్స్ వచ్చినా మేకర్స్ ఉషాకిరణ్ మూవీస్ వారి తీసుకుంటారని ధైర్యంతో ఎవరికీ ఇవ్వకుండా ఉన్నారట. ఆ తర్వాత బయ్యర్స్ రాక సినిమా విడుదల చేసే అవకాశం లేక అలా ఆగిపోయిందట. ఇప్పటికీ రామోజీ ఫిలిం సిటీలో దుమ్ము పట్టుకుపోయి ఆ కాపీ ఉందట. ఒకవేళ ఈ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే సౌందర్యకు చాలా మంచి పేరు వచ్చేదేమో.