టాలీవుడ్ లో షూటింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ డేట్స్ ప్రకటించడంతో క్రేజీ ప్రాజెక్టులన్నీ షూటింగ్స్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఇందులో భాగంగా అఖిల్, రవితేజ, ప్రభాస్, చిరంజీవి సినిమాల షూటింగ్స్ జోరుగా సాగుతున్నాయి.
ఏజెంట్ సినిమా చేస్తున్నాడు అఖిల్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ నానక్ రామ్ గూడలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో జరుగుతోంది. సురేందర్ రెడ్డి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు అనిల్ సుంకర నిర్మాత. అటు రవితేజ కూడా రావణాసుర షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో పోలీస్ అకాడమీలో ఓ సాంగ్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు.
మహేష్ బాబు హీరోగా సినిమా సెట్స్ పైకి వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రస్తుతం ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి గ్యాప్ లేకుండా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. మేజర్ షూటింగ్ హైదరాబాద్ లోనే ఉంటుంది. టోటల్ 5 సెట్స్ రెడీ అవుతున్నాయి.
ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమా షూటింగ్ కూడా నడుస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న షెడ్యూల్ ఇవాళ్టితో పూర్తయింది. చివరి రోజు ప్రభాస్ పై చిన్నపాటి ఛేజింగ్ సీన్ తీశారు. అటు చిరంజీవి తను చేస్తున్న భోళాశంకర్ సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తిచేశారు. త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.