ఈ మధ్య కాలంలో ఆన్లైన్ షాపింగ్ అనేది క్రమంగా పెరుగుతుంది. గత ఆరేళ్ళ కాలంలో చూసుకుంటే ఇంటర్నెట్ అందరికి అందుబాటులోకి రావడమే కాకుండా, ఆన్లైన్ షాపింగ్ సంస్థలు మారుమూల గ్రామాలకు కూడా తమ సేవలను విస్తరించడంతో ఆన్లైన్ షాపింగ్ అనేది క్రమంగా పెరుగుతూ వచ్చింది. అయితే ఈ ఆన్లైన్ షాపింగ్ ద్వారా సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుని షాపింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
Also Read:బ్యాండ్ వాయించిన సీఎం భార్య… వైరల్ అవుతున్న వీడియో..!
ఆన్లైన్ లో షాపింగ్ చేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకసారి చూద్దాం. కంప్యూటర్‌లో అయితే “https” ఉన్న వెబ్‌సైట్లలోనే షాపింగ్ చేసుకోవడం మంచిది. S లేని సైట్స్ నుంచి ఫ్రాడ్ ఎక్కువగా జరుగుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా మనం కొనాలి అనుకునే వెబ్ సైట్ చూడటానికి అవకతవకగా ఉంటే గనుక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
మొబైల్ యాప్ అయితే దానికి ప్లేస్టోర్/ఆప్‌స్టోర్‌లో రేటింగ్ ఎలా ఉందో గమనించి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అయితే సెల్లర్ వివరాలు, రేటింగ్ చూసి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఒకే వస్తువుకు ఎక్కువ సెల్లర్లు ఉండటాన్ని గమనించాల్సి ఉంటుంది. వాటిల్లో కస్టమర్ రేటింగ్ బాగున్న సెల్లర్ చెప్పిన ధర కాస్త ఎక్కువైనా సరే వారి వద్దనే కొనాలి.
కొన్ని వస్తువులు అంటే బట్టలు, ఫర్నిచర్, వగైరా ఉంటే గనుక సైజుల గురించి అనుమానాలు ఉంటే మాత్రం ముందే సెల్లర్‌కు సందేశం పంపి డౌట్ క్లియర్ చేసుకుని కొనాలి. ఆర్డర్ చేసే ముందే ఆ వస్తువు రిటర్న్ & రీఫండ్ వంటివి గమనించాల్సి ఉంటుంది. ఎక్కువగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుండి కొంటే గనుక అనుబంధ బ్యాంకు క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి. అప్పుడు తగ్గింపు, ఆఫర్లు ఎక్కువగా ఉంటాయి. ఏవైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటె గనుక వీడియో తీసి ఓపెన్ చెయ్యాలి.
Also Read:కోలీవుడ్ కు మరో మాస్ హీరో దొరికాడు