పిట్టమనసు పిసరంతైనా ప్రపంచమంతా దాగుందని ఆత్రేయగారు అన్నట్టుగా. మనిషి పొట్టిగా ఉంటే మాత్రం మనసు ఉండవా.!? ఆ మనసుకు ఓ తోడు కావాలని తపించదా…!? ప్రతీక్ విట్టల్ మోహిత్ ,ఈ షార్టెస్ట్ బాడీబిల్డర్ ఎత్తు 3 ఫీట్ల 4 ఇంచులు.
ఈ పొట్టి బాడీబిల్డర్ జయా అనే మరో మరుగుజ్జు అమ్మాయిపై మనసు పారేసుకున్నాడు.ఇటీవల ఆమెను పెళ్ళిచేసుకున్నాడు. కాగా ఆమె ఎత్తు 4 ఫీట్ల 2 ఇంచులు అయితేనేం అతని కంటే ఓ అడుగు ఎత్తైంది.
బాడీబిల్డర్ ప్రతీక్ 2021లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను కూడా సాధించాడు. పురుషుల విభాగంలో షార్టెస్ట్ కాంపిటీటివ్ బాడీబిల్డర్ టైటిల్ ప్రతీక్‌కు దక్కింది.
మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల బాడీబిల్డిర్.. 22 ఏళ్ల జయను పెళ్లాడాడు. నాలుగేళ్ల క్రితం ఈ ఇద్దరికీ పరియమైంది. ఆ తర్వాత ఆ ఇద్దరూ ఎంగేజయ్యారు. ప్రతీక్ తన పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు.
పెళ్లి కుమారుడి దుస్తుల్లో ఓ వాహనంపై నిలుచుని డ్యాన్స్ చేస్తున్న వీడియోను కూడా పోస్టు చేశారు. తన భార్యతో కలిసిన మరో ఫోటోను అప్‌లోడ్ చేశాడు. హల్దీ సెర్మనీ చెందిన ఓ వీడియో కూడా పోస్టు చేశాడు.
ప్రతీక్ తన బాడీబిల్డింగ్ కేరీర్‌ను 2012లో మొదలుపెట్టాడు. 2016లో తొలిసారి కాంపిటీషన్‌లో పాల్గొన్నాడు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తనకు సపోర్టు ఇచ్చినట్లు చెప్పాడు.
జయను చూసి వెంటనే నచ్చేసినట్లు తెలిపాడు. ఆమె కూడా తనను ఇష్టపడినట్లు చెప్పాడు. తన ఫిజిక్ జయను ఆకర్షించిందన్నాడు. ఓ మంచి ఉద్యోగంలో చేరి జయను బాగా చూసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేసాడు.