మన దేశంలో కొన్ని కొన్ని వ్యవహారాలు కాస్త ఆశ్చర్యంగా ఉంటాయి. ప్రతీ ఇంట్లో ఉండే కొన్ని సాంప్రదాయాలను మనం కచ్చితంగా ఫాలో అవుతాం. మతం ఆధారంగా ఉండే సాంప్రదాయాలు, కులాల వారీగా ఉండే సాంప్రదాయాలు ఇలా ప్రతీ ఒక్కటి ఫాలో అవుతూనే ఉంటాం. అవి ఫాలో కాని సందర్భంలో ఏదైనా కీడు జరిగితే అది ఫాలో కాలేదు కాబట్టే ఆ కీడు జరిగిందని ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు.
Also Read:చీరలో మెరిసిన కంగనా.. ధర తెలిసి షాక్..!
ఇక గ్రహణం ఏర్పడిన సమయంలో ఫాలో అయ్యే విషయాలు ఆసక్తికరంగానే ఉంటాయి. ఆ రోజు చికెన్ గాని ఇతర నీసు ఆహార పదార్ధాలు గాని తినకూడదు అనే సాంప్రదాయాలు ఉన్నాయి. అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో మహిళలు పూలు కూడా పెట్టుకోవద్దు, ఇల్లు కడుక్కోవాలి, గుడి మూసెయ్యాలి వంటివి ఉన్నాయి. ఇక మరో విషయం కూడా ఉంది. చంద్ర గ్రహణం పట్టేటప్పుడు గర్భవతి ఇంటి నుంచి బయటకు రావద్దు అంటారు ఎందుకు? అనే ప్రశ్న చాలా మందిలో ఉంది.
చంద్ర గ్రహణం పౌర్ణమి రోజులలో రాత్రి వేళల్లో ఎక్కువగా సంభవిస్తుంది. అయితే అన్ని పౌర్ణమి రోజులలో సంభవించదు. కారణం ఏంటీ అంటే… చంద్రుని కక్ష్య, భూ కక్ష్య మధ్య 5.9° కోణీయ దూరం వ్యత్యాసం ఉండటమే అన్నమాట. అందుకే చంద్ర గ్రహణం సమయంలో గర్భవతులు బయట తిరిగితే కడుపులో శిశువుకు హాని జరుగుతుందని చెప్తూ… ఏమీ తినకూడదని, గోళ్ళు గిల్లుకోకూడదని, ఎవరి ఇంటికి వెళ్ళకూడదు అని పూర్వం నుండి ఇండియాలో ఒక నమ్మకం.