యువ నటుడు నందమూరి తారకరత్న మరణం ఇప్పుడు ప్రతీ ఒక్కరి చేత కన్నీరు పెట్టిస్తుంది. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో కూడా అడుగు పెట్టాలని భావిస్తున్న తారకరత్న… నారా లోకేష్ పాదయాత్రకు సహకరించేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో పాదయాత్ర మొదటి రోజు వెళ్ళిన తారకరత్నకు గుండెపోటు వచ్చింది. ఇక ఆ తర్వాతి నుంచి 23 రోజుల పాటు ఆయనకు అనేక చికిత్సలు జరిగాయి.
Also Read: అక్కినేనికి భానుమతికి ఇంత గొడవ జరిగిందా…?
అయినా సరే తారకరత్న బ్రతకలేదు. బెంగళూరులోని నారాయణా హృదాయలం ఆస్పత్రిలో ఆయనకు చికిత్స చేసారు. తీవ్రమైన గుండెపోటు రావడమే ఆయన మరణానికి కారణం అని వైద్యులు తేల్చారు. ఇక ఇదిలా ఉంచితే తారకరత్న సినిమాల్లోకి రావడానికి ముందు కాస్త ఆసక్తికర పరిణామాలు జరిగాయి. సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు… వందవ సినిమా ఎవరితో చేయాలి అనే దానిపై సందిగ్దంలో ఉన్నారు.
అదే సమయంలో ఆయన వద్దకు అల్లు అరవింద్ వచ్చి అల్లు అర్జున్ తో సినిమా చేయాలని అడిగారు. ఇక మోహన కృష్ణ కూడా గంగోత్రి కథతో తారకరత్నను పరిచయం చేయాలని కోరారు. అల్లు అరవింద్… రాఘవేంద్ర రావుని కాస్త ఎక్కువ అడగడంతో గంగోత్రి కథ బన్నీతో చేసారు. ఆ తర్వాత మోహన కృష్ణ… బాలయ్య వద్దకు వెళ్లి ఒక మంచి దర్శకుడ్ని చెప్పాలి అంటే… బీ గోపాల్, సింగీతం శ్రీనివాసరావు పేర్లు చెప్పారు. ఆ ఇద్దరూ నో అన్నారు. కోదండ రామిరెడ్డితో మాట్లాడగా ఆయన ఒకే అని ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమా చేసారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.
Also Read: వందల కోట్ల బడ్జెట్, వెయ్యి కోట్ల ఇండియన్ సినిమాలు ఇవే…!