సినిమా వాళ్ళ జీవితాల గురించి ఎప్పుడూ ఏదోక వార్త వస్తూనే ఉంటుంది. వాళ్ళు తిన్నా, తినకపోయినా, ఎక్కడికి అయినా వెళ్ళినా ఏదైనా ఫోటో దిగినా సరే అది సంచలనం అవుతుంది. అగ్ర నటుల గురించి అయితే ఎన్నో వార్తలు మనం చూస్తూనే ఉంటాం. హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్ల గురించి ప్రచారాలు ఎన్నో వస్తు ఉంటాయి. ఇది ఇప్పుడు కాదు అప్పటి నుంచి కూడా ఇదే జరుగుతుంది.
అప్పట్లో అక్కినేని, అంజలీ దేవి గురించి ఎన్నో వార్తలు వచ్చేవి. ఇద్దరూ పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అనుకున్నారు కాని వేర్వేరు వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు. దీని గురించి గుమ్మడి పలు ఆసక్తికర విషయాలు రాసారు తన పుస్తకంలో. అంజలీదేవి ప్రేమ వివాహం కాదని… కానీ ఆమె భర్త… ఆది నారాయణ, అంజలి కుటుంబానికి దూరపు బంధువు ఇద్దరూ ఇండస్ట్రీలోనే ఉన్నారన్నారు ఆయన.
అంజలికి సంబంధించిన క్షేమ సమాచారాలు ఆదినారాయణ ద్వారా కుటుంబ సభ్యులు తెలుసుకునేవారని ఆయన ప్రస్తావించారు. తద్వారా వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని పేర్కొన్నారు. దాంతో కుటుంబ సభ్యులు వీరికి పెళ్లి చేస్తే బాగుంటుంది అని అనుకున్నారని, ఆ విధంగా అంజలీ దేవి సినిమా వాళ్ళనే పెళ్లి చేసుకున్నారని గుమ్మడి ప్రస్తావించారు. ఇక అక్కినేని అయితే తన మేనమామ కుమార్తెనే వివాహం చేసుకున్నారు.