గెజిటెడ్ ఆఫీసర్ సంతకమం అంటే గ్రీన్ ఇంకు తో పెడతారు. అసలు గ్రీన్ ఇంకుతో సంతకం ఎందుకు పెట్టాలి…? గ్రీన్ ఇంకుతో సంతకం పెట్టాలని తీసుకొచ్చింది ఎవరు…? గ్రీన్ ఇంకుతో సంతకం పెట్టె పద్ధతి తీసుకొచ్చింది బ్రిటీష్ వాళ్ళు. వారి ప్రభుత్వ సేవల్లో కొందరు అధికారులు నిర్ణయాలు తీసుకునే హోదా ఉన్న వాళ్ళు ఉన్నారు. వారు తయారు చేసిన డ్రాఫ్ట్ అంశాలు కి పూర్తి బాధ్యత వహించే వారిని అదే విధంగా… వారి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎప్పుడైనా సరే స్పందించే వారిని ఎంపిక చేసి గెజిటెడ్ హోదా ఇచ్చారు.
Also Read:టీఆర్‌ఎస్‌లో చేరలేదని కక్ష.. మంత్రిపై హెచ్చార్సీలో ఫిర్యాదు..!
వారికి ప్రమోషన్లు ,బదిలీలు, జీత భత్యాలు, అవార్డులు, పనిష్మెంట్ లు రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ లో ప్రకటన ఇచ్చేవారు. అప్పట్లో గెజిటెడ్ ఆఫీసర్లు పదివేల వరకు ఉండేవారు. ఇక పరిపాలన తో సంబంధం లేని వారిని అంటే… సాంకేతిక సిబ్బంది, బోధనా సిబ్బంది, వైద్య సిబ్బంది, చివరకు పోలీసు సిబ్బందిని గ్రంధాలయం సిబ్బంది కి కూడా రాష్ట్ర ప్రభుత్వం గెజిటెడ్ హోదా ఇచ్చారు. ఇప్పటికి కూడా అవి కొనసాగుతున్నాయి.
జనాభా పెరగడంతో ప్రింటింగ్ ఖర్చులకు బడ్జెట్ సరిపోకపోవడంతో రాష్ట్ర గెజిట్ లో వీరి వివరాలు ప్రచురణ పాతికేళ్ళ క్రితం ఆపేశారు. గెజిటెడ్ అధికారి ఏదైనా డాక్యుమెంట్ మీద సంతకం చేస్తే దాని జెన్యూనిటీ కి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఇతర ఉద్యోగులు వాడే సిరా కాకుండా వారికోసం ప్రత్యేకంగా… గ్రీన్ ఇంకు తీసుకొచ్చారు. ముందు వాళ్లు రెడ్ పెన్ వాడేవారు. క్రమంగా అది గ్రీన్ కలర్ కు వెళ్ళింది. అయితే చాలా మంది ఐఏఎస్ అధికారులు సాధారణ రంగులే వాడుతున్నారు. అయితే గ్రీన్ కలర్ పెన్ మాత్రమే వాడాలనే రూల్ లేదు.
Also Read:నిరుద్యోగులకు మంత్రి గంగుల బంపరాఫర్.. ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్