ఆస్కార్ అవార్డు అనేది సినిమాలలో ఉండే ప్రతీ ఒక్కరికి ఒక కల. ఒక్కసారైనా దాన్ని పట్టుకోవాలి అని కలలు కనే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈ ఏడాది మన తెలుగులో కూడా ఆస్కార్ సందడి చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు గానూ ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ సినిమాపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంశలు వ్యక్తమవుతున్నాయి. మన భారత కాల మానం ప్రకారం నేడు ఉదయం ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది.
మన తెలుగు సినిమాతో పాటుగా తమిళ డాక్యుమెంటరికి అవార్డు వచ్చింది. ఇక ఆస్కార్ కి సంబంధించి పలు విషయాలు వైరల్ గా మారాయి. ఆస్కార్ నగ్నంగా ఎందుకు ఉంటుంది, అలాగే ఆస్కార్ అవార్డు తయారు చేయడానికి అయ్యే ఖర్చు సహా పలు విషయాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇక ఇప్పుడు మరో విషయం కూడా బయటకు వచ్చి ఆసక్తిగా మారింది.
అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే… ఆస్కార్ అవార్డులు ఇచ్చే వాళ్లకు ముందు ప్రాక్టీస్ చేయిస్తారట. అందుకు గాను ముందు వాళ్లకు డమ్మీ అవార్డులు ఇస్తారట. కారణం ఏంటీ అంటే… ఆస్కార్ అవార్డు అందుకునే వరకు అవార్డు వస్తుంది అని తెలియదు… కంగారు పడి అది కింద పడేస్తారు అని ఆస్కార్ జ్యూరి అలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది. కాగా అవార్డు తయారు చేయడానికి 400 డాలర్ల ఖర్చు అవుతుంది.