టాలీవుడ్ లో రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ వ్యాప్తంగా ఆయన ఒక రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నారు. బాహుబలి సినిమాతో రాజమౌళి రేంజ్ ఎక్కడికో వెళ్ళింది. ఆ తర్వాత చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ సినిమా కూడా అంచనాలకు తగ్గట్టుగా ఉండటంతో ఆయనతో ఒక్క సినిమా చేసినా చాలు అని బాలీవుడ్ లో కూడా అనుకునే పరిస్థితి.
అయితే రాజమౌళి మాత్రం మన తెలుగు హీరోలతోనే సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సినిమా విషయంలో ఆయన బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంచితే రాజమౌళి అసలు డైరెక్టర్ కాదు హీరో కావాల్సింది అంటున్నారు ఆయన గురించి తెలిసిన వాళ్ళు.
రాజమౌళి తండ్రి ఒక కథ రెడీ చేసి కొడుకు హీరోగా ఒక సినిమా చేయాలి అని చూసారట. ఇందుకోసం ఆయన బీ గోపాల్ అనే అగ్ర దర్శకుడి తో కూడా చర్చలు జరిపారు. కాని రాజమౌళి మాత్రం తాను డైరెక్టర్ అవుతా అని హీరో అవ్వను అని స్పష్టంగా చెప్పారట. దీనితో చేసేది లేక ఆ కథను అలాగే దాచి ఉంచారు ఆయన తండ్రి. ఆ తర్వాత సీరియల్స్ కి వెళ్లి సినిమాల్లోకి వచ్చారు.