ఇంటి పేరు… మన పేరు ముందు రాయాలా వెనుక రాయాలా అనేది చాలా మందికి క్లారిటీ లేదు. మన తెలుగు సాంప్రదాయం విషయానికి వస్తే ఇంటి పేరు ముందు రాస్తారు. అంటే నందమూరి బాలకృష్ణ, కొణిదెల చిరంజీవి అన్నట్టు. ఇలా ఇంటిపేరు ముందు రాసిన తర్వాత అసలు పేరుని రాస్తారు. ఇక కులాలను బట్టి అసలు తర్వాత తగిలించుకునే వాళ్ళు ఉన్నారు. ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఇంటి పేరు ఉండదు అని అంటూ ఉంటారు.
ఉదాహరణకు పునీత్ రాజ్ కుమార్ పేరు చూస్తే… అతని పేరు ముందు ఉండి వాళ్ళ నాన్న పేరు తర్వాత ఉంటుంది. రజనీ కాంత్ అసలు పేరు చూసినా సరే అంతే ఉంటుంది. శివాజీ రావు గైక్వాడ్… కాని మనకు మాత్రమే అలా రాస్తారు. ఇంటి పేరు ఉందా అంటే చెప్పలేం గాని తండ్రి పేరు చివరన పెట్టుకుంటారు. ఇక ఉత్తర భారతంలో కూడా వాళ్ళ పేరు ముందు ఉండి తర్వాత వాళ్ళ నాన్న పేరు ఉంటుంది. అరవింద్ కేజ్రివాల్, సచిన్ టెండూల్కర్ లా అన్నమాట.
సింగ్, చౌహాన్, భట్టాచార్య, త్రివేది, చౌదురి వంటివి పేరు చివర ఉంటాయి. కొందరు కులాల పేర్లు పెట్టుకుంటారు. రోహిత్ శర్మ, అమిత్ మిశ్రా మాదిరి. అయితే ఇంటి పేరు లేదా తండ్రి పేరు ముందు ఉండాలా చివర ఉండాలా అనే దాని మీద క్లారిటీ ప్రభుత్వాలు కూడా ఇవ్వలేదు. అందుకే ఆధార్ కార్డులో కొందరు ముందు రాసుకుంటే మరికొందరు వెనుక రాసుకుంటారు. పాస్ పోర్టు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు లాంటి వాటిలో ముందుగా అసలు పేరు, తర్వాత ఇంటిపేరు పెడతారు. అది ఎలా ఉండాలో అప్లికేషన్ టైం లోనే చెప్పాలి. ఐటి కంపెనీలలో చేసే ఉద్యోగులను ముందు పేరుతో పిలుస్తారు. కాబట్టి ఇంటి పేరుతో పిలిస్తే వింతగా ఉంటది.