పెళ్ల్లి తర్వాత ఆడవారు తమ ఇంటి పేరు కచ్చితంగా మార్చుకోవాలా…? మార్చుకుంటే ఏ ఏ పత్రాల్ల్లో మార్చుకోవాలి…? పుట్టింటి పేరు మెట్టినింటిలో కూడా కంటిన్యూ చేయవచ్చు గాని కొన్ని సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక పెళ్లి అయిన తర్వాత భర్త ఇంటి పేరు ఏయే పత్రాల్లో మార్చుకోవాలో ఒకసారి చూస్తే…
Also Read:ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుకు షోకాజ్ నోటీసులు.. వారం రోజులు డెడ్‌లైన్..!
1.ఆధార్ ;మార్చాలి
ఆధార్ కార్డులో కచ్చితంగా మార్చుకోవడమే మంచిది. భవిష్యత్తులో పిల్లల చదువుల సమయంలో ఇబ్బందులు ఉండవచ్చు.
2.పాన్
ఇన్ కం టాక్స్ సమస్య లేని వాళ్ళు అయితే ఏం కాదు గాని ఇన్ కం టాక్స్, ఆర్ధిక లావాదేవీలు ఎక్కువగా జరిపే వారు మార్చుకోవడమే మంచిది.
3. బ్యాంక్
ఎన్ని అకౌంట్లు ఉంటే అన్నింటిలో మార్చుకోవడం ఉత్తమం. కొత్త పాస్బుక్ తీసుకోవాల్సి ఉంటుంది.
4. నెట్ బ్యాంకింగ్
ఆ తర్వాత నెట్ బ్యాంకింగ్ అకౌంట్స్ లో అప్డేట్ అయ్యేలా చూసుకోవడం మంచిది.
5. పీఎఫ్ ఎకౌంటు
ఉద్యోగి అయితే మాత్రం మీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ కి కూడా మార్చుకోవాలి.
6. పాస్పోర్ట్
పాస్పోర్ట్ పై మార్పించి కొత్తది తీసుకోవాల్సి ఉంటుంది.
7. ఇన్సూరెన్స్ పాలసి
ఇన్సూరెన్స్ పాలసీల్లో కూడా అప్డేట్ చేసుకోవాలి.
8. బండి రిజిస్ట్రేషన్
మన బండి రిజిస్ట్రేషన్ లో కూడా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆస్తి పత్రాలు, మీరు నామినిగా ఉండే డిపాజిట్ లకు సంబంధించి మార్చుకోవాల్సి ఉంటుంది.
ఒకటి రెండు ధ్రువీకరణ పత్రాల్లో మార్పించి అన్నీ మార్చకపోయినా ఇబ్బందులు ఉంటాయి. లేదంటే మాత్రం ఏదోక ఫార్మ్ జతచేసి ఇది కొత్త పేరు ఇది పాత పేరు అని డిక్లరేషన్ లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
Also Read:తెలుగు సినిమాలో అత్యంత దురదృష్టవంతులు వీళ్ళే…!