మన దేశంలో ఏదైనా ఒక విషయం చెడుగా చెప్తే దానికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అనవసర విషయాల మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఒక విషయమే కుక్కలు ఉన్న ఇంట్లో పూజ చేయకూడదు అనడం. కుక్క మన ఇంటి ప్రధాన ద్వారం దాటి లోపలకు వస్తే, ఇక ఆ పూటకు దేవతలుమనము పెట్టే నైవేద్యం స్వీకరించరు అనేది ఒక నానుడి ఉంది. అసలు ఎందుకు కుక్కల విషయంలో ఆ ఆలోచనా ధోరణి…?
వాస్తవంగా చెప్పాలి అంటే గతంలో జంతువులకు ప్రత్యేకంగా ఒక పాక శాల ఉండేది. కుక్కలను ముద్దు పెట్టుకోవడం, మూతి నాకడం వంటివి ఉండేవి కాదు. పక్కలో కూడా ఎక్కడో ఒకరు పడుకోబెట్టుకునే వారు అంతే. కాని ఇప్పుడు కుక్కే ప్రాణం అన్నట్టుగా పరిస్థితి ఉంది. మనం ఎంత శుభ్రం చేసినా సరే కుక్కలకు శుభ్రత తక్కువే. వాటి వెంట్రుకలు క్కూడా ఆహార పదార్ధాల మీద పడే అవకాశం ఉంది.
ఆ కుక్క ఇల్లoతా తిరిగి నైవేద్యాలన్నీ ముట్టుకుని ఎంగిలి చేస్తే అది దేవుడికి పెట్టడం కరెక్ట్ కాదు. కుక్క ఉన్న ఇంట్లో శుచీ శుభ్రత పూర్తి స్థాయిలో సాధ్యం అయ్యే పని కాదు. వాటికున్న సూక్ష్మ క్రిములు మనకి అంటుకోవడమే కాకుండా దేవుడి మీద కూడా పడే అవకాశం ఉంది. అందుకే ఇవన్నీ ఆలోచించి కుక్క ఉన్న ఇంట్లో పూజ చేయకూడదు అని చెప్పే వారు. అలా చెప్తే వినే అవకాశం లేదని… దేవతలు నైవేద్యం తీసుకోరు అని చెప్పారు.