ఆర్మీలో చేరాలి అంటే అనేక రకాలుగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఆర్మీ విషయంలో రక్షణ శాఖ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా టాటూల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఆర్మీలోకి వెళ్ళాలి అనుకున్న వారికి కచ్చితంగా టాటూ ఉండకూడదు అని అంటూ ఉంటారు. అందులో వాస్తవం ఎంత అనేది చూద్దాం.
Also Read:కరోనాతో షాకింగ్ సమస్య…? మీకు జుట్టు రాలుతుందా…?
మన సైన్యానికి టాటూ పాలసీ ఒకటి రూపొందించారు. 2015లో దీన్ని సవరించగా… దాని ప్రకారం సైన్యానికి ఎంపిక కావలసిన వ్యక్తి భారత ప్రభుత్వం గుర్తించిన ఏదైనా షెడ్యూల్డు తెగకు చెందిన వారైతే గనుక… వారి తెగ ఆచారాల ప్రకారం శరీరంలో ఏ భాగంలోనైనా ఏ రూపంలోనైనా టాటూలు వేసుకోవాల్సి వస్తే… ఆ అభ్యర్థికి టాటూలు శరీరంలో ఎక్కడ ఉన్నా సరే ఏ విధంగా ఉన్నా అనుమతిస్తారు.
కాని అది వారి తెగ ఆచారమని నిరూపించే పత్రాలు కావాల్సి ఉంటుంది. ఇక ఇతర వ్యక్తులకు తమ చేతులపై, కొన్ని అనుమతించిన ప్రదేశాలలో టాటూలు ఉండే అవకాశం కల్పించారు. ముంజేతి లోపలి భాగంలో కొన్ని ప్రాంతాలలో టాటూ ఉండవచ్చు. అదే విధంగా అరచేతి వెనుక భాగంలో కొన్ని ప్రాంతాల్లో టాటూ అనుమతిస్తారు. ఇక్కడ మినహా ఎక్కడ ఉన్నా సరే భారత సైన్యంలో చేరడానికి అనుమతి ఉండదు.
ఇక టాటూ కూడా ఎలా పడితే అలా ఉండకూడదు. రేసిస్ట్, సెక్సిస్ట్, ఇండీసెంట్ గా ఉండకూడదు. ఇతరులను కించపరిచేలా, ఎగతాళి చేసేలా ఉండకూడదు. ఇక ఆ టాటూని డాక్టర్ టెస్ట్ చేసి… దాని కారణంగా ఏ చర్మ వ్యాధులు రావని తెలిస్తే మాత్రమే అనుమతిస్తారు.
Also Read:ఫరూఖ్ వంతు.. ఈడీ కేసు.. కోర్టు ఆహ్వానం!