అందరు మాజీ ప్రధానుల సేవలను గుర్తించి, గౌరవించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ప్రధాని మోడీ అన్నారు. బీజేపీ పార్లమెంట్ సభ్యుల సమావేశాన్ని న్యూఢిల్లీలోని అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 14 మంది మాజీ ప్రధానులు చేసిన చేసిన సేవలను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.
ఈ మేరకు నెహ్రూ మ్యూజియంలో ప్రధాన మంత్రి సంగ్రహాలయ(పీఎం మ్యూజియం)ను ఏప్రిల్ 14న ప్రారంభించనున్నట్టు తెలిపారు.
అందరు మాజీ ప్రధానులు చేసిన గొప్ప పనులను ఈ మ్యూజియం ప్రతిభింబించనున్నట్టు వెల్లడించారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ మ్యూజియాన్ని కూడా ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు.
గరీబ్ కళ్యాణ్ యోజనా పథకాన్ని మరో ఆరు నెలలు పొడిగించినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి బీజేపీ ఎంపీలు ఆమోదం తెలిపారు.