బాలీవుడ్ స్టార్ నటుడు వరుణ్ ధావన్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ వరుణ్ వివాహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్త జంటకు శుభాకాంక్షలు అంటూనే ఇకపై మరో మంచి నటుడు వివాహం అనే ఊబిలోకి దిగడాని ఆమె చెప్పుకొచ్చింది. మనం ఇక ఆన్ స్క్రీన్ పై ఆయనను ఎక్కువగా చూసే అవకాశం ఉండకపోవచ్చని ఎందుకంటే సినిమాల్లో హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తే ఆ హీరో భార్య ,అత్తవారి ఇంటి వాళ్ళు అంగీకరించకపోవచ్చని చెప్పుకొచ్చింది.
ఇకపై ఆయన పురుష ప్రాధాన్యమున్న సినిమాలో మాత్రమే నటిస్తాడా అంటూ ప్రశ్నార్థకం పెట్టింది. సినీ, వ్యక్తిగత జీవితాన్ని ఇకపై ఎలా బ్యాలెన్స్ చేస్తాడో అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం శ్రద్ధా శ్రీనాథ్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.