యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత హారిక హాసిని క్రియేషన్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ప్రచారం లో ఉంది.
అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో మొదట జాన్వికపూర్ నటించబోతున్నారని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ అయితే బాగుంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. కాగా సాహో చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి శ్రద్ధ కపూర్ పరిచయమైన సంగతి తెలిసిందే.