విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వెంకటేష్ డిఫరెంట్ రఫ్ లుక్ లో కనిపించనున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్ గ్లింప్స్ కాకరేపుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని వెంకీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే ఈ సినిమా ట్రైలర్, టీజర్ రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నారు. ఇప్పటికే ఓ పాత్ర కోసం రుహానీ శర్మను ఎంపిక చేయగా.. మరో పాత్ర కోసం ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఈ కథకు ఆమె పాత్రే కీలకంగా ఉండనున్నట్లు సమాచారం. ఇక మూడో హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఈ పాత్ర కోసం ఓ బాలీవుడ్ భామను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తోంది చిత్ర బృందం.
అలాగే బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మెడికల్ మాఫియా నేపథ్యంతో వస్తున్న ఈ మూవీ గురించి మరిన్ని అప్ డేట్ లు త్వరలో వెల్లడిస్తామంది చిత్ర యూనిట్.