కొరియన్ పాప్ మ్యూజిక్ కు ప్రపంచ వ్యాప్తంగా యువతలో మంచి క్రేజ్ ఉంది. సంగీత శైలిలో ఈ కే-పాప్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందింది. కొరియన్ పాప్ బ్యాండ్ లో బీటీఎస్, బ్యాండ్ బ్లాక్ స్వాన్ వంటి అనేక గ్రూపులున్నాయి. అయితే.. తాజాగా కే పాప్ సింగర్ గా ఒక భారతీయ గాయని మారనుంది.
ఒడిశాకు చెందిన 18 ఏళ్ల గాయని శ్రేయ లెంకా కొరియన్ పాప్ మ్యూజిక్ లో అడుగు పెట్టనున్న మొట్టమొదటి భారతీయ స్టార్ గా ఎంపికైంది. బ్రెజిలియన్ అమ్మాయితో కలిసి బ్లాక్ స్వాన్ బ్యాండ్ లో తన గానాన్ని వినిపించనుంది.
గత సంవత్సరం డిసెంబర్ లో ఒడిశాకు రూర్కెలా నగరానికి చెందిన శ్రేయ బ్లాక్ స్వాన్ లో మెంబర్ గా ఎంపికకావడానికి ఆడిషన్ ఇచ్చింది. ఈ మేరకు సియోల్ లో చివరి దశ శిక్షణకు ఎంపికైంది. ఈ మేరకు ఐదుగురు అమ్మాయిలతో బ్లాక్ స్వాన్ గ్రూప్ ఏర్పాటైంది. ఈ గ్రూప్ నుంచి హేమే నవంబర్ 2020లో నిష్క్రమించింది.
అనంతరం.. గ్రూప్ ప్రమోటర్ డీఆర్ మ్యూజిక్ సంస్థ గత ఏడాది మే నెలలో గ్లోబల్ ఆడిషన్ లను ప్రకటించింది. యూ ట్యూబ్ ఆడిషన్ ప్రోగ్రామ్ లో సుమారు 4,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో బ్రెజిల్ కు చెందిన గాబ్రియేలా డాల్సిన్, భారత్ కు చెందిన శ్రేయ లెంకాలు ఎంపికయ్యారు. దీంతో కొరియన్ పాప్ బ్యాండ్ లో ఎంపిక అయిన భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది శ్రేయ.