బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహించి నిర్మిస్తున్న చిత్రం… ఎమర్జెన్సీ. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు భారత రాజకీయ చరిత్రలోనే ప్రధానమైన ఎమర్జెన్సీ రోజుల నాటి విషయాలను సినిమాగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో కీలక పాత్ర అయిన ఇందిరా గాంధీ పాత్రను కంగనా రనౌత్ పోషిస్తుండగా… జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ కథలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పాత్రకూ ఎంతో ప్రాధాన్యముంది.తాజాగా ఆ పాత్రను శ్రేయస్ తల్పడే పోషిస్తున్నారని చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా శ్రేయస్ మాట్లాడుతూ… భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ప్రియమైన నాయకుల్లో వాజ్ పేయిఒకరు.
అలాంటి గొప్ప వ్యక్తి పాత్రను పోషించడాన్ని గౌరవంగా, పెద్ద బాధ్యతగా భావిస్తున్నా. నేను అందరి అంచనాలను అందుకుంటానని ఆశిస్తున్నా అని తెలిపారు.