నటి శ్రియా శరణ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఎన్నో తెలుగు సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన ఆర్‌ఆర్‌ఆర్ త్వరలో రిలీజ్ కాబోతుంది.
ఇకపోతే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది శ్రియా శరణ్. హెర్నియాతో బాధపడుతున్న తన భర్తకు చికిత్స చేసిన అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్‌కు ఆ పోస్ట్ లో కృతజ్ఞతలు తెలిపారు.
ఆండ్రీకి చాలా జాగ్రత్తగా చికిత్స చేసిన డాక్టర్ కి కూడా కృతజ్ఞతలు తెలిపింది. ఆండ్రీ ఆపరేషన్‌కు ఉపాసన కొణిదెల సపోర్ట్ చేశారని ఆమెకి కూడా కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే తన భర్త తో దిగిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది శ్రియా శరణ్. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అజయ్ దేవగన్ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం దృశ్యం 2 లో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
Advertisements