గబ్బర్ సింగ్ సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ శృతిహాసన్. గతంలో వరుస సినిమాలతో బిజీ బిజీ గా గడిపిన శృతికి ఇప్పుడు కాస్త అవకాశాలు తగ్గాయి. దీనితో సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తున్న శృతి తాజాగా ఓ మేగజీన్ కవర్ పేజీపై మెరిసింది. బ్లాక్ డ్రెస్, దానిపైన బంగారు గొలుసులు, ఆపై గోల్డెన్ మాస్క్ ధరించి శ్రుతి వయ్యారంగా నిలుచుంది. కరోనా మహమ్మారీ విజృంభిస్తున్న వేళ మాస్క్‌లు ధరించడం గురించి సెలబ్రిటీలు అవగాహన కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రుతి గోల్డెన్ మాస్క్ ధరించి ఫొటో షూట్‌లో పాల్గొంది.