గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం క్రాక్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది. అయితే ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ నటించింది. ఇందులో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించగా భార్యగా శృతిహాసన్ మెప్పించింది.
అయితే ఆ పాత్ర డిమాండ్ చేయాలే కానీ తల్లి పాత్ర కూడా చేస్తాను అంటుంది ఈ అమ్మడు. తల్లి పాత్రలో నటించడం వల్ల కెరీర్ కి ఎలాంటి ఆటంకాలు రావని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. పాత్ర కీలకంగా మారి కథతో అనుసంధానమై ఉంటే ఇకపై కూడా అమ్మ పాత్రలో నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఆ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.