మీడియాతో రెగ్యులర్ గా టచ్ లో ఉండే హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు. తన సినిమా కబుర్లతో పాటు వ్యక్తిగత విశేషాల్ని షేర్ చేసుకోవడానికి ఎప్పుడూ మొహమాటపడదు ఈ ముద్దుగుమ్మ. టాపిక్ ఏదైనా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఈమె స్టయిల్. ఓ కీలకమైన అంశం పై కూడా శృతిహాసన్ ఓపెన్ గా రియాక్ట్ అయింది. అదే నార్త్ ఫిలిం ఇండస్ట్రీ, సౌత్ ఫిలిం ఇండస్ట్రీ.
ప్రస్తుతం బాలీవుడ్ ను సౌత్ ఇండస్ట్రీ డామినేట్ చేస్తోంది. బాహుబలి-2 పెద్ద హిట్టయింది. తర్వాత కేజీఎఫ్, సాహో లాంటి సినిమాలు కూడా రూల్ చేశాయి. తాజాగా పుష్ప సినిమా కూడా బాలీవుడ్ లో వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఈ క్రమంలో బాలీవుడ్ ను సౌత్ సినిమా ఆక్రమిస్తుందా అనే ప్రశ్న శృతిహాసన్ కు ఎదురైంది.
నిజానికి ఇది చాలా సున్నితమైన ప్రశ్న. అవును అంటే ఒక బాధ, కాదు అంటే మరో బాధ. ఎందుకంటే, రెండు ఇండస్ట్రీల్లో శృతిహాసన్ సినిమాలు చేస్తోంది. మరీ ముఖ్యంగా ముంబయిలోనే ఉంటోంది. అందుకే దీనిపై అంతే సున్నితంగా ప్రశ్నించింది శృతిహాసన్. ప్రస్తుతం ఇండియన్ సినిమా వెలిగిపోతోందట. చాలా సినిమాలు బాగా ఆడుతున్నాయట. ఇలాంటి టైమ్ లో నార్త్-సౌత్ అనే డిఫరెన్స్ తీసుకురావొద్దని సూచిస్తోంది శృతిహాసన్. మూవీ ఏదైనా, దాన్ని ఇండియన్ సినిమాగా చూడాలని.. అప్పుడే పరిశ్రమ మరింత ముందుకెళ్తుందని సూచిస్తోంది.
చెన్నై ఇష్టమా, ముంబయి ఇష్టమా అనే ప్రశ్నకు మాత్రం సూటిగా స్పందించింది. తను చిన్నప్పట్నుంచి చెన్నైలో చాలా తక్కువగా ఉన్నానని, అమ్మతో ముంబయిలో ఉన్నదే ఎక్కువని చెప్పింది. కాబట్టి తనకు ముంబయి అంటేనే ఎక్కువ ఇష్టమంటోంది. రీసెంట్ గా ముంబయిలోని ఓ ఖరీదైన ప్రాంతంలో ఫ్లాట్ కొనుగోలు చేసింది శృతి.