తన వ్యక్తిగత విషయాల్ని బయటపెట్టడంలో హీరోయిన్ శృతిహాసన్ అస్సలు మొహమాటపడదు. ఉన్నదున్నట్టు మాట్లాడ్డం ఈమె స్టయిల్. లండన్ బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిన విషయాన్ని, మరో కొత్త బాయ్ ఫ్రెండ్ తగిలాడనే విషయాన్ని స్వయంగా ఈ ముద్దుగుమ్మే బయటపెట్టింది. తాజాగా తన ప్రేమకథలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది ఈ బ్యూటీ.
డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శృతిహాసన్ డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అతడితో దిగిన సెల్ఫీల్ని ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అతడి బర్త్ డేల్ని కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంది. అయితే వీళ్లిద్దరి డేటింగ్ లో ఎవరు ముందుగా ‘ఐ లవ్ యు’ చెప్పారు?
ఇది చాలా పర్సనల్ విషయం. అయినప్పటికీ శృతిహాసన్ స్పందించింది. తనే ముందుగా హజారికాకు ఐ లవ్ యు చెప్పానంటోంది శృతిహాసన్. తనపై ప్రేమను శాంతను చాలాసార్లు వ్యక్తపరిచాడని, కానీ ఐ లవ్ యు అని మాత్రం చెప్పలేదంటున్న శృతిహాసన్.. తనే ముందుగా అతడికి ప్రేమిస్తున్నానంటూ చెప్పానని క్లారిటీ ఇచ్చింది.
ఓవైపు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ ముద్దుగుమ్మ, మరోవైపు సినిమాలతో కూడా అంతే బిజీగా ఉంది. ప్రభాస్ సరసన సలార్ చేస్తోంది. తాజాగా బాలకృష్ణ-గోపీచంద్ మలినేని సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే చిరంజీవి సరసన కూడా నటించనుంది. బాబి ఈ సినిమాకు దర్శకుడు.