బయోపిక్ మూవీలో నటించాలన్న ఆసక్తి అందరి నటీ నటులకు ఉంటుంది. కొందరికైతే ఎప్పటికైనా తమ కథనే సినిమా చేస్తే బాగుండన్న ఆలోచన కూడా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఆలోచనలనే హీరోయిన్ శృతి హసన్ భయటపెట్టింది.
ఇన్‌స్ట్రాలో అభిమానులతో కాసేపు చిట్ చాట్ చేసిన శ్రుతి హసన్… మీ కథ బయోపిక్‌గా తీస్తే.. ఏం పేరు పెడతారని ఓ అభిమాని అడిగితే ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. రోటీన్ ఆన్సర్ చెప్పకుండా… జ్వాలాముఖి అనే టైటిల్ పెడతానంటూ వెంటనే జవాబిచ్చేసింది. తనకు నటన వారసత్వంగా వచ్చిందని, ఆ కళ తనకు పుట్టుకతోనే ఉందని, అయితే.. దాన్ని కాపాడుకోవడానికి నేను అనుక్షణం కష్టపడుతుంటానని తెలిపింది.
ఇక నెగిటీవ్ పాత్రలంటే తనకు చాలా ఇష్టమని, అలాంటి పాత్ర కోసం ఎదురు చూస్తున్నానని తెలిపింది. శృతి హసన్ రెండు సినిమాలు చేస్తోంది. పవర్ స్టార్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ తో పాటు రవితేజ క్రాక్ మూవీలో నటిస్తుంది.