బ్యూటీ విత్ బ్రెయిన్ అంటే వెంటనే గుర్తొచ్చే హీరోయిన్లలో శృతిహాసన్ పేరు తప్పకుండా ఉంటోంది. నిత్యం మీడియా కెమెరాలకు చిక్కి సోషల్ మీడియాలో వైరల్ కావడం, డేటింగ్ వార్తలతో పతాక శీర్షికలను ఆకర్షించడం శృతికి సర్వసాధారణంగా మారాయి. అగ్ర నటులు, భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉండే అమ్మడు.. ఇటీవల జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో తన ప్రేమ, అఫైర్లు, డేటింగ్ లాంటి విషయాలపై కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది.
”నా కెరీర్ గురించి చెప్పాలంటే.. 2022లో అంతా సానుకూలంగా ఉంది. వెబ్ సిరీస్ తో నా ఈ సంవత్సరం మొదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ, ప్రేమను పొందగలిగాను. అలాగే ప్రభాస్ తో సలార్, చిరంజీవితో చిరు154, బాలకృష్ణతో ఎన్ బీకే107 చిత్రాలతో పాటు.. పలు దక్షిణా చిత్రాల్లో నటిస్తున్నాను. ఇంకా పలు సినిమాల గురించి చర్చలు జరుగుతున్నాయి” అని శృతి హాసన్ చెప్పింది.
ముంబై తనకు సొంత నగరం లాంటిందని.. హిందీ సినిమా రంగంలో కూడా బిజీగా అయ్యేందుకు ప్రయత్నిస్తున్నానని వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ. తన తల్లిదండ్రులు విడిపోయినప్పటి నుండి తాను ముంబైలో అమ్మతో కలిసి హిందీ మాట్లాడుతూ పెరిగానని చెప్పింది. 2009లో లక్ అనే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సందర్భాలను గుర్తు చేసుకుంది. ఇప్పటికి చాలా సినిమాలు చేశానని.. కానీ అంతగా గుర్తింపు లభించలేదని చెప్పుకొచ్చింది శృతి.
తన జీవితంలోని అఫైర్లు, డేటింగ్ గురించి శృతిహాసన్ ఓపెన్ అయింది. శంతను.. హజారికాకు తనకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పింది. వారి ద్వారా తమ పరిచయం ఏర్పడిందని తెలిపింది. సినిమా, మ్యూజిక్, కళలు తమ మధ్య కామన్ విషయాలుగా ఉంటాయని పేర్కొంది. అందుకే మేమిద్దరం చాలా దగ్గరయ్యామని చెప్పింది. శంతను లాంటి వాళ్లు చాలా రేర్ గా ఉంటారన్నది ఈ అమ్మడు. తాను గతంలో చాలా మంది యాక్టర్లతో డేటింగ్ చేశానని.. కానీ.. వాళ్లతో వర్కవుట్ కాలేదని చెప్తూనే.. శంతను లాంటి వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారని చెప్పింది.
Advertisements
అయితే.. శృతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె మాటలు నెటిజన్లు.. చెంతనుతో డేటింగ్ బాగుందని చెప్పకనే చెప్పిందంటూ స్క్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా చెంతనుతో డేటింగ్ చేసినట్టు ఇన్ డైరెక్ట్ గా చేప్పిందిగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.